Prabhas: అదేంటీ డార్లింగ్ జక్కన్నను అంత మాట అనేశావ్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక త్వరలోనే ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రభాస్ కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ నేను గత 20 సంవత్సరాలుగా ప్రశాంత్ వంటి గొప్ప డైరెక్టర్ ని ఎప్పుడు చూడలేదని తెలిపారు. నా ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్ లో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే తప్పకుండా నేను ప్రశాంత్ పేరు చెబుతాను అంటూ ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ప్రభాస్ అభిమానులు షాక్ అవుతూ ఈ విషయంపై కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీరు పాన్ ఇండియా స్థాయిలో ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్నారు అంటే అందుకు కారణం రాజమౌళి గారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనతో మీరు మూడు సినిమాలు చేశారు మీకు మూడు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను అందించాయి

అంతేకాకుండా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా (Prabhas) మారారు ఆ తర్వాత అన్ని వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా నేడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం రాజమౌళినే అని కానీ మీరు మాత్రం బెస్ట్ డైరెక్టర్ అంటే ప్రశాంత్ పేరు అని చెప్పడం ఏంటి బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు మాత్రం అదేంటి డార్లింగ్ నీకు లైఫ్ ఇచ్చిన జక్కన్నను అంత మాట అనేసావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus