దుబాయ్ లో సాహో షూటింగ్ పై ప్రభాస్

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై అందరి కళ్ళు ఉన్నాయి. వారందరిని సంతృప్తి పరిచే విధంగా సుజీత్‌ తెరకెక్క్కిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో కంప్లీట్ చేసిన డైరక్టర్ మూడో షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్లారు. వారం రోజులుగా అబుదాబిలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్‌ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. 250 మంది టెక్నీషియన్స్ 50 రోజులపాటు ఇందుకోసం కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేసింది. అందులో సాహో షూటింగ్ గురించి ప్రభాస్ వెల్లడించారు.

” నా స్నేహితులు, పరిశ్రమలోని చాలా మంది చిత్రీకరణకు అబుదాబి చాలా మంచి చోటని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఉంది ఇక్కడ. టుఫోర్24, లోకల్ క్రూ, అభిమానులు, ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది” అని అన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus