స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి శుభవార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడైన ప్రభాస్ తాజాగా రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా తర్వాత తనకు ఏకంగా 5,000 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని ప్రభాస్ తెలిపారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా పాపులర్ అయిన ప్రభాస్ తాను పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
తనకు ఎక్కువ సంఖ్యలో పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని అయితే ఇదో పెద్ద కన్ఫ్యూజన్ అని ప్రభాస్ పేర్కొన్నారు. తనను పెళ్లికి సంబంధించి ప్రశ్నలు అడిగిన వాళ్లను 5,000 పెళ్లి ప్రపోజల్స్ వస్తే ఏం చేస్తారని ప్రభాస్ రివర్స్ లో ప్రశ్నించారు. రాధేశ్యామ్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాకపోవడంతో టెన్షన్ పడిన ఫ్యాన్స్ సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్ మొదలవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలోని పలు థియేటర్లు రెక్లెయినర్ సీట్లకు గరిష్టంగా 295 రూపాయలు వసూలు చేస్తున్నాయి.
టికెట్ రేట్లు ఒక్కో థియేటర్ లో ఒక్కో విధంగా ఉండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం రాధేశ్యామ్ సినిమాకు పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ మధ్య కాలంలో ఏపీలో పెద్ద సినిమాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే రాధేశ్యామ్ మాత్రం బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఆలస్యంగా మొదలుకావడంతో ఏపీలోని పలు థియేటర్లలో తొలిరోజు ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కి రిలీజవుతున్న సినిమా రాధేశ్యామ్ కావడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.