Prabhas: ప్రభాస్ సలార్ లో అవి వాడుతున్నారా?

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో స్టార్ హీరో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుండగా సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ పాతకాలపు వాహనాలపై ఎక్కువగా మోజు పడుతున్నారని తెలుస్తోంది. తన సినిమాలలో ప్రభాస్ వింటేజ్ వాహనాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ 1970 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో అప్పటి కార్లను ఈ సినిమాలో వినియోగించారని తెలుస్తోంది.

ప్రభాస్ కార్లను డ్రైవ్ చేస్తూ రాధేశ్యామ్ సినిమాలో కనిపిస్తారని సమాచారం. ప్రభాస్ సలార్ కోసం కూడా వింటేజ్ వెహికిల్ ను వినియోగిస్తున్నారని ఎన్ ఫీల్డ్ తరహాలో పాతకాలపు బుల్లెట్ ను తయారు చేసి ఈ మూవీలో ఉపయోగిస్తున్నారని సమాచారం. సినిమాలోని ఒక యాక్షన్ సీన్ లో వింటేజ్ బైక్స్ కనిపిస్తాయని తెలుస్తోంది. సలార్ మూవీ యాక్షన్ సన్నివేశాల కొరకు నిర్మాతలు భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని సమాచారం.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాధేశ్యామ్, సలార్ సినిమాలు హిట్టైతే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus