Prabhas Sreenu: మారుతి మూవీపై అంచనాలు పెంచిన ప్రభాస్ శ్రీను.. ఆ సీక్రెట్స్ చెబుతూ?

ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi Dasari) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ (The Rajasaab) మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజాసాబ్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశారు. రాజాసాబ్ పాన్ ఇండియా సినిమాల కంటే పెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. రాజాసాబ్ మూవీ పండుగ విందు భోజనంలా ఉంటుందని రెగ్యులర్ సినిమాలతో పోల్చి చూస్తే ఈ మూవీ భిన్నమైన ప్రాజెక్ట్ అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.

ఇప్పటివరకు ఆడియన్స్ చూడని యాంగిల్స్ ఈ సినిమాలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. (Prabhas Sreenu) ప్రభాస్ శ్రీను ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్పారంటే రాజాసాబ్ వేరే లెవెల్ లో ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో హర్రర్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులలో ప్రభాస్ శ్రీను ఒకరు. ప్రభాస్ నటించిన చాలా సినిమాలలో ప్రభాస్ శ్రీను నటించారు. (Kalki) కల్కి 2898 ఏడీ విడుదలైన తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి.

రాజాసాబ్ మూవీ తన కెరీర్ లో స్పెషల్ మూవీ అవుతుందని మారుతి సైతం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ ఉంటుంది. యంగ్ జనరేషన్ హీరోలతో, మిడిల్ రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలు తీసిన మారుతి ప్రభాస్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని భావిస్తున్నారు.

పీపుల్స్ మీడియా బ్యానర్ పై నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాతలు ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus