Prabhas Srinu, Anushka: అనుష్క గురించి ప్రభాస్ శ్రీను ఏం చెప్పాడంటే..?

అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ.. అందమైన అమ్మాయిలకి అంతకన్నా అందమైన, మంచి మనసుంటే.. దేవత అని అంటుంటారు.. ఈ మాట అనుష్క విషయంలో నిజం అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.. కింగ్ నాగార్జున ‘సూపర్’ మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన అనుష్క.. తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది.. దాదాపు సీనియర్ హీరోలతో పాటు.. యంగ్ స్టర్స్ అందరితోనూ యాక్ట్ చేసింది.. తనతో వర్క్ చేసిన హీరోలు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా తను చాాలా మంచి పర్సన్ అని చెప్తుంటారు..

‘అరుంధతి’ నుండి స్టార్ డమ్ ఏ రేంజ్ లో పెరిగిందో.. లేడీ ఓరియంటెడ్ కథలకు ఎలా కేరాఫ్ అడ్రెస్ గా మారిందో, ఆమె మార్కెట్, రెమ్యునరేషన్ లాంటి విషయాలు చాలా వరకు అందరికీ తెలిసినవే.. జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్ల క్యారెక్టర్ గురించి, యాటిట్యూడ్ గురించి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి కానీ అనుష్క విషయంలో అలాంటి పుకార్లు, రూమర్స్ వినిపించవు.. ఒకవేళ కావాలని ఎవరైనా కలిపించుకుంటేనో.. పుట్టించుకుంటేనో తప్ప..

అనుష్క ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పూరి, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైవిఎస్ చౌదరితో సహా సెలబ్రిటీలందరూ ఆమె వ్యక్తిత్వం గురించి, మంచి మనసు గురించి చెప్పిన మాటలు విన్నాం.. చూశాం.. రీసెంట్ గా అనుష్కతో తనకున్న రిలేషన్ గురించి, ఆమె గొప్పదనం గురించి.. ఒకప్పటి ప్రభాస్ PA కమ్ ఆర్టిస్ట్ ప్రభాస్ శ్రీను చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

‘‘అనుష్కలో.. అమ్మ, అక్క, చెల్లి, వదిన.. ఇలా ఆడాళ్ల ఉండే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.. నేను చాలామంది బాంబే హీరోయన్లను చూశాను కానీ అనుష్క టోటల్ డిఫరెంట్.. తను మా అందరి మనసులకు దగ్గరైన వ్యక్తి.. మాకు రోల్ మోడల్.. షి ఈజ్ మై స్వీటెస్ట్ స్వీటీ’’ అంటూ, తను దగ్గరి నుండి చూసిన, తనకు తెలిసిన అనుష్క గురించి చాలా బాగా చెప్పాడు ప్రభాస్ శ్రీను..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus