Prabhas Srinu: కృష్ణంరాజు ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ శ్రీను!

వెండితెరపై రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దివంగత నటుడు కృష్ణంరాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన నటుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితమే అయితే కృష్ణంరాజు గారు మరణించి ఏడాది పూర్తి అయిందని చెప్పాలి. ఇక కృష్ణంరాజుకి కుమారులు లేకపోవడంతో ప్రభాస్ ని తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రభాస్ సైతం తన పెదనాన్న కృష్ణంరాజు లాగే ఇతరుల పట్ల ఎంతో మంచితనంతో సేవాగుణంతో మెలిగే వారు. ఇతరులకు అతిథి మర్యాదలు చేయడంలో కృష్ణంరాజు కుటుంబానికి ఎవరు సాటి రారని చెప్పాలి. అదే అలవాటు ప్రభాస్ కి కూడా వచ్చిందని చెప్పాలి. ఈ విషయం గురించి ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలో ప్రభాస్ తో ఎంతో మంచిగా సన్నిహితంగా ఉండేటటువంటి వారిలో ప్రభాస్ శ్రీను ఒకరు.

తాజాగా ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కృష్ణంరాజు గురించి అలాగే ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు గారు చాలా గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆయనకు సరదాగా ఉండేవారు అంటే చాలా ఇష్టమని అందుకే తనని చాలా ఇష్టపడేవారు అని శ్రీను వెల్లడించారు. ఇక కృష్ణం రాజుగారు ప్రభాస్ ని యువరాజు అని నన్ను మంత్రి అని పిలిచేవారని ఈయన తెలియజేశారు.

ఇక కృష్ణంరాజు గారు ప్రభాస్ గారు చాలా గొప్ప వ్యక్తులు అయినప్పటికీ వీళ్లు మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని తెలియజేశారు. రాజుల కుటుంబానికి చెందినటువంటి వీరు ఇతరులకు ఇచ్చేటటువంటి ఆతిథ్యం చాలా గొప్పగా ఉంటుందని ఈ విషయంలో మాత్రం కృష్ణంరాజు దేవుడితో సమానమని ఈయన తెలియజేశారు. ఇక తనకు కూడా కృష్ణంరాజు గారు ఒక దేవుడితో సమానంగానే ఆయనని భావిస్తానని ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను (Prabhas Srinu) కృష్ణంరాజు గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus