Prabhas: అక్కడ కూడా ప్రభాస్ నంబర్ వన్.. ఆదిపురుష్ హిట్టైతే తిరుగులేదా?

  • May 16, 2023 / 03:32 PM IST

రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తాజాగా ఓరమ్యాక్స్ ఏప్రిల్ నెల ఫలితాలు వెల్లడి కాగా ఈ ఫలితాల్లో ప్రభాస్ టాప్ పొజిషన్ లో నిలిచారు. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో బాహుబలి ప్రభాస్ కు తొలి స్థానం దక్కింది.

ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ (Prabhas) మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటే మాత్రం మరికొన్ని సంవత్సరాల పాటు ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో కొనసాగే అవకాశం అయితే ఉంది. ఆదిపురుష్ హిట్టైతే మాత్రం ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల చరణ్ కు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది.

చరణ్ తర్వాత ఈ జాబితాలో టాలెంటెడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు చోటు దక్కింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ సక్సెస్ తో తారక్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. పుష్ప2 మూవీ వీడియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ పుష్ప2 సినిమాతో మరో సక్సెస్ ను అందుకోవడం గ్యారంటీ అని అభిమానులు చెబుతున్నారు.

ఈ జాబితాలో మహేష్ బాబు ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. మహేష్ గత కొంతకాలంగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాని ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవగా పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నిలిచారు. చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ 8, 9 10 స్థానాలలో నిలవడం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ తమ టాలెంట్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus