Prabhas: ప్రభాస్‌ కోసం ప్రేమ కథ సిద్ధం చేసిన లవ్‌ డైరక్టర్‌… అన్నీ ఓకే అయితే త్వరలో…!

ప్రభాస్‌ లాంటి కటౌట్‌.. ప్రేమకథల్లో నటిస్తే.. ఆ ఊహే అద్భుతంగా ఉంది.. ఇక సినిమా వస్తే పండగే అని చెప్పాలి. ఎందుకంటే లవర్‌ బాయ్‌గా ప్రభాస్‌ యాక్టింగ్‌లో ఆ మజానే వేరు. ఈ మేరకు ప్రభాస్‌ నుండి కొన్ని ప్రేమకథలు వచ్చినా.. ఇంకా ఫ్యాన్స్‌కి ఆ ఆకలి తీరలేదు అని చెప్పాలి. ఇలా మీరు అనుకుంటున్నారా? అయితే మీ కోసం ప్రభాస్‌ ఓ ప్రేమకథ ఓకే చేస్తున్నాడని అని టాక్‌ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో వైవిధ్యమైన ప్రేమకథల స్పెషలిస్ట్‌గా పేరున్న హను రాఘవపూడి ఆ సినిమా చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

భారీ బ‌డ్జెట్‌, సూప‌ర్ హీరో, ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్‌, కామెడీ హారర్‌.. ఇలా ఏదైనా స‌రే ప్రభాస్‌ సై అంటాడు. ఇప్పుడు చెప్పిన జోనర్‌లో సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఇప్పుడు వాటికి లవ్‌ స్టోరీని యాడ్‌ చేయొచ్చు. తాజాగా ప్ర‌భాస్ కోసం ఓ అంద‌మైన ప్రేమ‌క‌థను హ‌ను రాఘ‌వ‌పూడి సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ‘సీతారామం’ సినిమా ఇటీవల మంచి విజయం అందుకున్న హను.. తన తర్వాతి సినిమాను ఓకే చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభాస్‌ను కలిశారని అంటున్నారు.

హను రాఘవపూడి రాసుకున్న కథకు ప్రభాస్‌ లాంటి పెద్ద స్టార్‌.. అలాగే భారీ బ్యానర్‌ ఉండాలంట. ఇటీవల ప్ర‌భాస్‌ని సంప్ర‌దించి సినిమా పాయింట్‌ కూడా చెప్పినట్లు స‌మాచారం. నిజానికి ప్ర‌భాస్ ప్రేమ‌క‌థ చేసి చాలా రోజులైంది. మొన్నామధ్య వచ్చిన ‘రాధే శ్యామ్’ ప్రేమకథే అయినప్పటికీ.. అదొక రకం. అంతేకానీ ప్యూర్‌ లవ్‌ స్టోరీ అయితే కాదు. ఇప్పుడు హను రాఘవపూడి అలాంటి కథే రాసుకున్నారు అని చెబుతన్నారు.

ఈ మ‌ధ్య ప్ర‌భాస్ (Prabhas) వరుస యాక్ష‌న్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో వైవిధ్యం కోసం మారుతి సినిమా ఓకే చేసి పని పూర్తి చేస్తున్నారు. ఇదే క్రమంలో హను సినిమా కూడా ఓకే అవ్వొచ్చు అంటున్నారు. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది చూడాలి. సొంత బ్యానర్‌లో చేస్తాడా, లేదంటే వేరే బ్యానర్‌తో కలసి చేస్తాడా అనేది చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus