ఆ అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి ఫిక్స్..!

ఇండియా వైడ్ ప్రభాస్ కు క్రేజ్ ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ కోసం ఐదేళ్ళ కష్టానికి ఫలితం అది. మనోడు హైట్, గ్లామర్ కు పర భాషా ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పటికీ ప్రభాస్ నుండీ అందరూ ఒక జవాబు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేనండీ.. అతను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడా అనే..! ఇప్పటి వరకూ ప్రభాస్ ఈ ప్రశ్నను దాటేస్తూ వచ్చాడు. ఇలా ప్రభాస్ సారైన సమాధానం చెప్పకుండా దాటేయడం వల్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘బాహుబలి’ పూర్తయిన వెంటనే పెళ్ళి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ‘బాహుబలి’ విడుదలై ఇప్పటికీ రెండేళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు ‘సాహో’ కూడా వచ్చేస్తుంది.. అయినా పెళ్ళి ఊసే లేదు.

కొద్దిరోజుల క్రితం ప్రభాస్ ని పెళ్ళి విషయం పై ప్రశ్నిస్తే.. ‘అంతా పెదనాన్న ఇష్టమే’ అంటూ మాట దాటేసాడు. పోనీ కృష్ణంరాజు ఏమైనా క్లారిటీ ఇచ్చారా అంటే అదీ లేదు. అక్టోబర్ 23 కి ప్రభాస్ 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ఆయన అభిమానుల్లో ప్రభాస్ పెళ్ళి విషయం పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకానొక సమయంలో ప్రభాస్.. అనుష్కని పెళ్ళి చేసుకోబోతున్నాడని.. ప్రచారం జరిగింది. కానీ ‘ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని… తామిద్దరం మంచి స్నేహితులమని’ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ పెళ్ళి పై మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. ప్రభాస్ అమెరికా అమ్మాయితో పెళ్ళికి సిద్ధమవుతున్నాడట. అమెరికాలోని బిజినెస్ రంగంలో అభివృద్ధి చెందిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి కూతురితో ప్రభాస్ పెళ్ళి ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ‘సాహో’ రిలీజైన వెంటనే ప్రభాస్ పెళ్ళి హడావిడి మొదలవుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. కనీసం ఈ వార్తయినా నిజమైతే బాగుణ్ణు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus