ప్రభాస్ మాటలకు షాక్ తిన్న అభిమానులు

తమాషాకి అన్నారో.. విసుగుపుట్టి అన్నారో.. తెలియదు కానీ ప్రభాస్ మాటలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి. ప్రభాస్ చెప్పిన మాటలకు అభిమానులు షాక్ లో ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెరిగిన తన రేంజ్ కి తగ్గట్టు సినిమా చేస్తున్నారు. ఆశ్చర్యపరిచే రీతిలో సాహసాలు చేస్తున్నారు. సాహో సినిమా కోసం రిస్కీ షాట్ లో సైతం డూప్ లను వాడకుండా స్వయంగా నటిస్తున్నారు. రీసెంట్ గా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేస్ ఆధ్వర్యంలో అబుదాబిలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేశారు. ఏడు నిముషాలు ఉండే ఈ సీన్ సినిమాలో హైలెట్ కానుందని సమాచారం. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ పనుల్లో డైరక్టర్ సుజీత్ టీమ్ బిజీగా ఉండగా ప్రభాస్ మాత్రం మీడియాకి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ‘సాహో’ తరువాత ఏం చేయబోతున్నారనే ప్రశ్నను ప్రభాస్ ని అడగగా.. అతను అవాక్ అయ్యే సమాధానం ఇచ్చారు. “ఈ సినిమా(సాహో) పూర్తయిన తర్వాత ఏదైనా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకుంటానేమో” అంటూ ప్రభాస్ చెప్పారు. ఇలా ఎందుకు అన్నాడని కొంతమంది ఫ్యాన్స్ కంగారు పడుతూ ఆరా తీస్తుంటే.. మరికొంతమంది మాత్రం వెండితెరపై రైతు గా నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సాహో మూవీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మితం అవుతుండడంతో షూటింగ్ ఆలస్యం అవుతోందని నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus