తన మార్కెట్ ని విస్తరించుకుంటున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచమొత్తం పాపులారిటీ సంపాదించుకున్నారు. ఏ తెలుగు హీరోకి రాని గుర్తింపు ప్రభాస్ సొంతం చేసుకున్నారు. బాషా బేధం లేకుండా ప్రభాస్ ని దేశం మొత్తం తమ హీరోగా భావిస్తోంది. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. అన్ని ప్రాతాలవారు కనెక్ట్ అయ్యే సబ్జెక్టును ఎంచుకున్నారు. దీనిని ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ఈ సినిమాకి ఆదరణ ఉండాలని హీరోయిన్ , విలన్ తో పాటు ఇతర పాత్రలకు బాలీవుడ్ నటీనటులను తీసుకున్నారు. ఈ మూవీ స్లో అండ్ స్టడీ రీతిలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత కూడా భారీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు తెలిసింది. మెర్సెల్ సినిమాతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన అట్లీతో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అతని రీసెంట్ గా చెప్పిన ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ కథ ప్రభాస్ కి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. పర్మిషన్ లభించడంతో అట్లీ స్క్రిప్ట్ పనుల్లో దిగారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మెర్సల్ (అదిరింది) లో మోడీ ప్రభుత్వం పనితీరుని ప్రశ్నించిన అట్లీ .. ఇందులో ఏ అంశం గురించి ప్రస్తావిస్తారోనని భారత్ లోని చిత్ర పరిశ్రమలు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus