Prabhas: ఆదిపురుష్ విజువల్స్ అద్భుతం.. ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకులను కాస్త నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న తదుపరి చిత్రం సలార్, ఆదిపురుష్ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్,ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆకాష్ తాజాగా చోర్ బజార్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆకాష్ తన సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పూరి జగన్నాథ్ కుటుంబానికి ప్రభాస్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆకాష్, ప్రభాస్ ఇద్దరూ ఎంతో సరదాగా ఉంటారు.

ఆకాష్ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రాన్ని ప్రభాస్ పెద్దఎత్తున ప్రమోట్ చేశారు. ఈ విధంగా రొమాంటిక్ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ఒక రోజు మొత్తం తమతో గడిపారని ఆకాష్ ఈ సందర్భంగా తెలిపారు. అదే రోజే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారని ఆకాష్ తెలిపారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ ఎంతో అద్భుతంగా ఉంది.

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రభాస్ మామూలుగా లేడు ఫాన్స్ కి విజువల్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుందని ఈ సందర్భంగా ఆకాష్ ఆదిపురుష్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. ప్రస్తుతం చోర్ బజార్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆకాష్ ఆదిపురుష్ సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus