ఇదే ఇలా ఉంటే.. అదేలా ఉంటుందో..?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఈసినిమాకి ఛాప్టర్ 2 ని స్టార్ట్ చేసినప్పటినుంచీ కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ సన్నివేశాలు తీయడంలో మనోడు అందవేసిన చెయ్యి అని ఆడియన్స్ కి బాగా తెలిసింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ రాంగానే యూట్యూబ్ షేక్ అయిపోయింది. ఫ్యాన్స్ అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, కేజీఎఫ్ ని మించేలా ఈసినిమా ఉందంటూ, యష్ మాస్ యాక్షన్ థియేటర్స్ బద్దలైపోతాయి అంటూ రెచ్చిపోతున్నారు. సినీ లవర్స్ ని, మాస్ ప్రేక్షకులని బీభత్సంగా ఆకట్టుకున్న కేజీఎఫ్ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే ఇలా ఉందంటే.., అదెలా ఉంటుందో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ లో యష్ కి ఎలివేషన్ ఇచ్చిన షాట్స్ చూసినవాళ్లందరూ కూడా నోరు వెళ్లబెడుతున్నారు.

ఇక మాస్ యాక్షన్ తో రెచ్చిపోయే రెబల్ స్టార్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సలార్ ప్రాజెక్ట్ ని కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కిస్తుండటం, అందులోనూ ముందుగానే మాస్ యాక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ గా ప్రెజంట్ చేస్తే ఆ లెవల్ వేరేగా ఉంటుందని, ఈ కాంబినేషన్ లో టీజర్ వస్తే యూట్యూబ్ పగిలిపోద్దని అంటున్నారు ఫ్యాన్స్. వీరిద్దరి సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus