Prabhas: ప్రభాస్‌ మూడుసార్లు దెబ్బ తిన్నాడేమో.. ఈసారి దెబ్బ కొడతాడంటున్న ఫ్యాన్స్‌!

క్రికెట్‌లో ఓ నానుడి ఉంటుంది. ఫామ్‌ ఈజ్‌ టెంపరరీ… క్లాస్‌ ఈజ్‌ పర్మినెంట్‌. అంటే ఏదో ఒకట్రెండు మ్యాచుల్లో ఆడలేకపోతే… ఫామ్‌ కోల్పోవచ్చు కానీ.. క్లాస్‌ ఆట మాత్రం అలానే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు బయటికొస్తుంది అని. ఇదే నానుడిని సినిమాలకు అన్వయిస్తే.. ‘రిజల్ట్‌ ఈజ్‌ టెంపరరీ.. క్రేజ్‌, టాలెంట్‌ ఈజ్‌ పర్మినెంట్‌’. రెండు, మూడు సినిమాలు ఆడకపోతే ఆ హీరో ఇక అయిపోయినట్లే అని అనుకోవడానికి వీళ్లేదు అని. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే ప్రభాస్‌ గురించి.

‘బాహుబలి’ సినిమాలతో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్‌ ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయాడు. పాన్‌ ఇండియా ఇమేజ్‌ మోజులోనే, ఇంకెందుకో కానీ సరైన కథలు, కాన్సెప్ట్‌లు, దర్శకుల్ని పట్టుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. భారీ కథ, భారీ తారాగణం తప్ప సినిమాలో భారీగా ఏమీ ఉండటం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని ‘డైనోసార్‌’ అవతారం ఎత్తాడు. ‘సలార్‌’ సినిమాలో ప్రభాస్‌ లెక్క అలానే ఉంటుంది అని చెబుతున్నారు.

అయితే, ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్‌ జనాలు ప్రభాస్‌తో పోటీ చాలా సులభం అనే రేంజిలో మాట్లాడుతున్నారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్, ‘ఆదిపురుష్‌’ ఫలితాలు చూసి ‘సలార్‌’ను, ప్రభాస్‌ను తక్కువగా చూస్తున్నారు అని డార్లింగ్‌ ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. మా డార్లింగ్‌ డైనోసార్‌ను తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నారు.. పవర్‌ చూపిస్తాడు, పడగొడతాడు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రభాస్‌కు చాలా అవసరం. ప్రశాంత్‌ నీల్‌ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

అయితే, ఈ సినిమా ప్రచారం సరిగ్గా లేదనే వాదనలు కూడా ఉన్నాయి. వాటిని సరి చేసుకుని ప్రచారం మొదలుపెడితే.. వివేక్ అగ్నిహోత్రి మాటలను తిప్పికొట్టొచ్చు అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఆయన ప్రస్తావన ఎందుకు అనేగా మీ డౌట్‌. ఎందుకంటే ‘సలార్‌’ సినిమాకు పోటీగా ‘వాక్సిన్ వార్’ సినిమాను తీసుకొస్తాం అనే అర్థం వచ్చేలా, (Prabhas) ప్రభాస్ మీద పైచేయి సాధిస్తానని ఆయన ఈ మధ్య అన్నారు కాబట్టి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus