ఉత్తమ నటుడిగా ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. నిర్మాత సురేష్ కొండేటి నడిపిస్తున్న “సంతోషం” సినీ వార పత్రిక ఆధ్వర్యంలో 2003 నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరిస్టులు, టెక్నీషియన్లను అవార్డుతో సత్కరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం “సంతోషం 2016” అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో ప్రజల మెప్పుపొందిన వారికి అవార్డ్స్ అందజేసి ప్రోత్సహించారు.

ఇందులో ఉత్తమ నటుడిగా డార్లింగ్ అవార్డు అందుకున్నారు. బాహుబలిలో అయన నటనగాను ఈ అవార్డు వరించింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు బాహుబలి చిత్ర బృందం అనందం వ్యక్తం చేసింది. బాహుబలి ఇప్పటివరకు జాతీయ అవార్డులతో పాటు అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విలన్ తో పాటు దాదాపు 12 కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అవార్డు మాత్రం అందుకోలేక పోవడం తో ఆ వెలితి ఉండిపోయింది. సంతోషం 2016 అవార్డ్స్ వారు ప్రభాస్ ప్రతిభను గుర్తించి, గౌరవించడంతో సంతోషంగా ఉన్నారు.

ఉత్తమ నటిగా అనుష్క(రుద్రమ దేవి), ఉత్తమ సహాయ నటుడిగా రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు), ఉత్తమ హీరో (తొలి పరిచయం) గా అఖిల్ సంతోషం అవార్డ్స్ అందుకున్నారు. సినీ అతిరధుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక త్వరలో బుల్లితెర లో ప్రసారం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus