సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే పైరసీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. కానీ కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాకముందే ఇంటర్నెట్లో లీక్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూశాం. అంతకంటే ఘోరంగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఇంటర్నెట్లో లీక్ అవుతూ ఉండటం అందరికీ షాకిచ్చే అంశం. తాజాగా ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja saab) సినిమా కూడా ఇలా లీకుల బారిన పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘హారర్ రొమాంటిక్ మూవీ’… ‘ది రాజాసాబ్’ సినిమా నుండి ఓ ఫైట్ సీన్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.. ఇందులో హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) రూఫ్స్ కట్టుకుని ఓ ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా మార్కెట్ వాతావరణాన్ని తలపిస్తుంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది కాబట్టి..
ఇది ‘ది రాజాసాబ్’ సినిమాలో వీడియో క్లిప్ అంటూ అంతా వైరల్ చేస్తున్నారు. కానీ ఇందులో నిజం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. మాళవిక మోహనన్ తమిళంలో ‘సర్దార్ 2’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇందులో ఆమె రా ఏజెంట్ గా నటిస్తుందని, అందుకే ఒక యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొనాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఆ సినిమాకు సంబంధించింది అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.