సినీ పరిశ్రమలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతా బాగానే ఉంది.. అనుకుంటున్న టైంలో వరుసగా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. వయసు మీద పడ్డ సీనియర్ నటులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందుతున్నారు. ఇంకొంతమంది గుండెపోటు వంటి సమస్యలతో మృత్యువాత చెందుతున్నారు. ఇక యువ నటీనటులు రోడ్డు ప్రమాదాలకు లేదు అంటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం వంటి వార్తలు వింటూనే ఉన్నాం. తెలుగులో అనే కాకుండా మిగతా భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి.
తాజాగా ఓ సీనియర్ నటుడు గుండెపోటుతో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటుడు విజయ రంగరాజు (Vijaya Gangaraju) అలియాస్ రాజ్ కుమార్ ఈరోజు కన్నుమూశారు. గత వారం ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డ ఆయన ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో కూడా ఈయన బాధపడుతూ వస్తున్నారు. అయితే చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఈయన కన్నుమూసినట్టు సమాచారం. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు అయ్యింది.
విజయ రంగరాజుకి (Vijaya Gangaraju) ఇద్దరు కూతుర్లు. ఇక ఈయన సినీ కెరీర్ ను గమనిస్తే.. కెరీర్ ప్రారంభం నుండి ఈయన ఎక్కువగా విలన్ , సహాయ నటుడు పాత్రలు పోషించారు. 1994వ సంవత్సరంలో వచ్చిన ‘భైరవద్వీపం’ సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. గోపీచంద్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘యజ్ఞం’ సినిమాలో ఈయన ఓ విలన్ గా నటించారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు.