ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా (Prabhu Deva) తన స్టెప్పులతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచీ ఎన్నో హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేయడం, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో స్టేజ్ షోలు అదరగొట్టడం అతనికే సాధ్యమైన మ్యాజిక్. అయితే ఇప్పుడు ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేస్తూ మరోసారి హైలెట్ గా నిలిచాడు. చెన్నైలో ఇటీవల జరిగిన ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ కార్యక్రమంలో ఆయన తన కుమారుడు రిషి రాగవేంద్ర దేవాను స్టేజ్‌పై పరిచయం చేశాడు.
తన కొడుకుతో కలిసి డాన్స్ చేయడం ప్రభుదేవాకు (Prabhu Deva) ఇదే మొదటిసారి. ఆ అనుభూతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ, ‘‘ఇది కేవలం ఓ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఇది నా వారసత్వం.. ఇప్పుడే మొదలవుతున్న జర్నీ!’’ అంటూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు రిషి కూడా తన తండ్రిలాగే డ్యాన్స్ టాలెంట్‌ను ప్రదర్శించాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వారిలో రిషి రాగవేంద్ర, మరొకరు అదిత్. అయితే ఈ వేడుకలో రిషి రాగవేంద్ర తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. స్టేజ్‌పై తన తండ్రితో కలిసి కాలు కదిపిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘ఆడదామా’’ అంటూ ఫుట్‌మూవ్ లతో అదరగొట్టిన రిషి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అభిమానులు ‘‘ప్రభుదేవా వారసుడు కూడా డాన్స్‌లో రారాజే!’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రభుదేవా విషయానికి వస్తే.. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఆయన లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్‌కు పలు ప్రముఖులు హాజరై, అభిమానులతో కలిసి ఆనందంగా గడిపారు. మొత్తానికి ప్రభుదేవా తన కుమారుడిని స్టేజ్ పై పరిచయం చేయడం, అతను కూడా తన టాలెంట్‌ను చూపించడంతో ఈ ఇవెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిషి రాగవేంద్ర తన తండ్రి బాటలోనే ముద్ర వేయనున్నాడా? ఆయన డ్యాన్స్ మాస్టర్ గానే కొనసాగుతాడా లేక నటనలోనూ అదరగొడతాడా? అన్నది ఆసక్తిగా మారింది.