ప్రముఖ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు ప్రభుదేవా..!

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా కూడా పలు హిట్ సినిమాల్లో నటించి చివరికి‌ దర్శకుడిగా స్థిరపడ్డాడు ప్రభుదేవా. ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అనుకోండి… అయితే తన డ్యాన్స్ తో మాత్రం ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్నాడు. ఇక దర్శకుడిగా అయితే టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో, అక్కడ కూడా హిట్టైన సినిమాలను తమిళ్ లో తెరకెక్కిస్తూ ఉంటాడు ప్రభుదేవా. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే..

ఈయనకు ఆల్రెడీ పెళ్లైన సంగతి తెలిసిందే. ఈయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళయ్యారు. కానీ అతని భార్య రామలత కు విడాకులు ఇచ్చి ప్రస్తుతం వేరుగా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటన్నది.. యావత్ సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. 47 ఏళ్ళ వయసు కలిగిన ప్రభుదేవా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది ఫేక్ న్యూస్ అని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ప్రభుదేవా సెప్టెంబర్ లోనే సీక్రెట్ గా రెండో పెళ్లి చేసేసుకున్నాడట. వివరాల్లోకి వెళితే..

గతంలో వెన్నెముక సమస్యతో బాధపడుతూ వచ్చిన ప్రభుదేవా… ఓ హాస్పిటల్ జాయిన్ అయ్యి పిజియోథెరపీ చేయించుకున్నాడు. అదే టైములో ఈయనకు చికిత్స అందించిన డాక్టర్‌తోనే ప్రేమలో పడ్డాడట ప్రభుదేవా. అంతేకాదు ఆ తరువాత డేటింగ్ కూడా చేశారట. బీహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌ ను సెప్టెంబర్‌లోనే రెండో పెళ్లి చేసుకున్నాడట ప్రభుదేవా. ముంబైలో ఉన్న ప్రభుదేవా ఇంట్లో చాలా సీక్రెట్ గా ఈ పెళ్లి జరిగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుదేవా దంపతులు చెన్నైలో కాపురం ఉంటున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus