Pragathi: త్రెడ్‏మిల్ పై ప్రగతి వర్కౌట్స్ మాములుగా లేవుగా…!

టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో ఈమె ఎక్కువగా అమ్మ,పిన్ని,అత్త.. పాత్రల్లో కనిపిస్తుంటుంది. అయితే గతేడాది కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఈమె సోషల్ మీడియాలో ఓ స్టార్ గా అవతరించింది.వరుసగా తన గ్లామర్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు, జిమ్ వర్కౌట్ల వీడియోలను పోస్టు చేస్తూ కుర్రకారుని సైతం ఆశ్చర్యపరిచింది.అక్కడితో ఆగలేదు అలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ తన ఫాలోవర్స్ ను, నెటిజన్లను అలరిస్తూనే వస్తుంది.

ప్రగతి ఏ వీడియో పోస్ట్ చేసినా అది ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. 46ఏళ్ళ వయసులో ప్రగతి జిమ్ లో చేసే కసరత్తులకు ఎవరైనా ఔరా అనాల్సిందే. తాజాగా మరోసారి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోని పోస్టు చేసింది. ఇందులో చెమటలు కక్కుతూ తెగ కష్టపడుతుంది ప్రగతి. ఈ వీడియో ద్వారా నయా బెల్లి వర్కవుట్‌ ను చేసి నెటిజన్లకు చూపించింది. సాధారణంగా త్రెడ్ మిల్ పై అందరూ రన్నింగ్, జాగింగ్ చేస్తుంటారు. కానీ ప్రగతి మాత్రం చేతులతో నడుస్తూ కాళ్ళని ఓ కుర్చీలో పెట్టింది.

ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఈమె డెడికేషన్ కు అందరూ వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘బిగ్‏బాస్5′ లో ఈమె కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ వర్కౌట్సా?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈమె ‘బిగ్ బాస్’ కు వెళ్ళేదే లేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సరే ప్రగతి లేటెస్ట్ వర్కౌట్స్ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus