‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే.ఈసారి నలుగురు సినీ ప్రముఖులు పోటీ చేస్తుండటంతో .. ఎవరు గెలుస్తారో? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈసారి ప్రకాష్ రాజ్ కూడా పోటీ చేస్తుండడంతో కొందరు అసహనానికి గురవుతున్నారు. ఓ కన్నడ వ్యక్తి అయిన ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఏంటి? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.’ ‘కన్నడ పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్.. ‘మా’ లో పోటీ చేస్తున్నారు..
తెలుగులో మగాళ్లు లేరా?’ అంటూ తాజాగా నటి మాధవీలత విరుచుకుపడ్డ సంగతి కూడా తెలిసిందే. ఇక ‘బిగ్ బాస్’ ఫేమ్ కరాటే కళ్యాణి కూడా.. ‘నేను ప్రకాష్ రాజ్ కు ఓటు వెయ్యను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్ల పై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించారు.. “ప్రతిభకి లోకల్ ఫీలింగ్ అనేది ఉండదు అని నా అభిప్రాయం. అయినప్పటికీ నేను టాలీవుడ్లో 25 ఏళ్లుగా ఉన్నాను. 1995 లో వచ్చిన ‘సంకల్పం’ చిత్రంతో ఇక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యింది.
అయినా నేను లోకల్ కాదు అంటున్నారు. ఇక సెట్ లో నేను ఎవ్వరితోనూ మాట్లాడను.. టైం కి రాను అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నాకున్న టైములో నేను యాక్టింగ్ చేస్తున్నా, ప్రొడక్షన్ చూసుకుంటున్నా, డైరెక్షన్ చేస్తున్నా,పొలంలో వ్యవసాయం చేస్తున్నా, నా పెళ్ళాం పిల్లలను చూసుకుంటున్నా..! అదే విధంగా ‘మా’ లో నా బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తా” అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!