Prakash Raj: కొడుకు కోరాడని అలా చేసిన ప్రకాష్ రాజ్!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి తరచూ ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని చెబుతూ అభిమానులకు షాకిచ్చారు. స్వయంగా సోషల్ మీడియా వేదికగా తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అయితే కొడుకు వేదాంత్ కోరిక మేరకు పోనీవర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నానని రివీల్ చేసి అభిమానులను ప్రకాష్ రాజ్ ఆశ్చర్యపరిచారు.

2009 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి సోదరి లలితకుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాగా అనారోగ్య సమస్యల వల్ల అబ్బాయి చనిపోయాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. కుమారుడు వేదాంత్ కోసం ఉత్తుత్తి పెళ్లి చేసుకుని ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలిచారు. అబ్బాయి పెళ్లి వేడుకను చూడాలని పట్టుబట్టడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

కుటుంబంతో గడిపే సమయం చాలా సంతోషాన్ని కలిగిస్తుందంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ కొడుకు కోసం చేసిన పనిని కొంతమంది నెటిజన్లు మెచ్చుకుంటుంటే మరి కొంతమంది మాత్రం ప్రకాష్ రాజ్ పై సెటైర్లు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం పుష్ప, అన్నాత్తే, కేజీఎఫ్2 సినిమాలలో నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుస ఆఫర్లతో ప్రకాష్ రాజ్ బిజీగా ఉండటం గమనార్హం.

1

2

3

4

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus