రాంగోపాల్ వర్మ.. ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ‘డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుని ఏ రేంజ్లో క్యాష్ చేసుకోవచ్చు’.. అనే విషయాన్ని ప్రాక్టికల్ గా వర్కౌట్ చేసి.. చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, అలాగే మరో అడల్ట్ కంటెంట్ సినిమాని తీసి క్యాష్ చేసుకున్న వర్మ.. ఆ తరువాత ‘పవర్ స్టార్’ అనే సినిమాని తీసి అందులో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
ఇక సినిమా రిలీజ్ అయ్యాక అవి ఇంకా పెరుగుతాయి అనుకుంటే.. అలాంటిది ఏమీ జరగలేదు. దానికి కారణం.. ‘పవర్ స్టార్’ సినిమాలో మొదటి నుండీ పవన్ కళ్యాణ్ ను కమెడియన్ గా చూపించిన వర్మ.. చివరికి ఓ బిస్కెట్ పడేసి పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేసేసాడనే చెప్పాలి. అయితే కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం వర్మని ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. అయితే అనూహ్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. వర్మకు మద్దతు ఇవ్వడం.. ఆశ్చర్యం కలిగించే విషయం.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “తన అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. హద్దులు దాటనంత వరకూ ఎటువంటి సమస్య ఉండదు. వర్మ హద్దు దాటడనే నేను అనుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మతో నేను ఎక్కువగా కలిసి సినిమాలు చెయ్యలేదు. కానీ మేము చాలా సార్లు కలుసుకున్నాం. ఆయనకున్న తెలివి విజ్ఞానం నిజంగా చాలా గొప్పవి. అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరి దగ్గర ఉండదు. పవన్ కళ్యాణ్ పై వర్మ సినిమా తీసాడు అని విన్నాను.. కొట్టుకోవడం కన్నా ఇది బెటర్ కదా..తప్పేమీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?