ఏంటీ ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్… ఏంటి అప్పుడే ఎన్నికైపోయారా? అనే డౌట్ వచ్చిందా? మీకొచ్చిన డౌట్ కరెక్టే. కానీ పరిణామాలు చూస్తుంటే ఆయన మా అధ్యక్షుడు అవ్వడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్‌కు చిరంజీవి సపోర్టు ఉండటం. గతంలో జరిగిన మా ఎన్నికల పరిస్థితులు, ఫలితాలు చూస్తే ఈ విషయం ఎవరైనా చెప్పేస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో… చిరంజీవి మద్దతు ఉన్న వాళ్లే దాదాపు గెలిచారు.
గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేష్, అంతకుముందు అధ్యక్షుడుగా చేసిన శివాజీరాజా… ఇలా అంవదరూ చిరంజీవి బ్యాచే. అయితే వీళ్లందరి కోసం చిరంజీవి వచ్చి నేరుగా ప్రచారమూ చేయరు, ఓటేయండి ఎవరికీ చెప్పరు. అయితే ఆ పని చేసేది నాగబాబు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌కి మద్దతు ఇస్తున్నామని నాగబాబు ఇటీవల ప్రకటించేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ఎన్నిక దాదాపు ఖాయం అని తెలుస్తోంది. అయితే మరి ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యర్థిగా ఎవరు పోటీలో నిలబడతారు అనేది ఇక్కడ ప్రశ్న.
ప్రకాశ్ రాజ్‌కు పోటీగా మంచు విష్ణు నిలబడతారని కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. అయితే వాటిలో నిజం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం చిరంజీవి, మోహన్‌బాబు మధ్య ఉన్న బంధం ప్రకారం చూస్తే… విష్ణు ఈ పోటీలో ఉండరు అనుకోవచ్చు. అయితే మోహన్‌బాబు ఆలోచనలను ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఏదైనా జరగొచ్చు. అయితే ప్రకాశ్ రాజ్ ప్రత్యర్థిగా వేరే ఎవరైనా నిలబడే అవకాశమూ ఉంది. ప్రకాశ్ పరభాషా నటుడు అనే మాట లేకుండా… ‘ఆయన భారతీయ నటుడు’ అని నాగబాబు ప్రకటించి తేల్చేశారు. కాబట్టి ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ దాదాపు ఖాయం.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?