Pranavi,Sreeleela: శ్రీలీల ప్ర‌ణ‌వి మానుకోండకు ఏమి చెప్పిదంటే!

  • July 29, 2023 / 05:53 PM IST

బేబి’ బ్యూటీ వైష్ణ‌వి చైత‌న్య ఎంట్రీతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ పై వాడి వేడి చ‌ర్చ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికైనా తెలుగు అమ్మాయిలంతా ప‌రిశ్ర‌మ‌కి రావాల‌ని బ‌న్నీ లాంటి వారు పిలుపు నివ్వ‌డంతో! ఈ వ్యాఖ్య‌లు కొత్త వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా యూట్యూబ్ వంటి ఛానెల్స్ వేదిక‌గా త‌మ ప్ర‌తిభ‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అలాంటి వారంద‌రిలో నూత‌నోత్స‌హం క‌నిపిస్తుంది.

తాజాగా బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు న‌టిస్తోన్న ‘స్ల‌మ్ డాగ్ హ‌స్బెండ్’ సినిమాతో మ‌రో తెలుగమ్మాయి ప్ర‌ణ‌వి మానుకోండ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు గెస్ట్ గా శ్రీలీల విచ్చేసింది. ఆమె కూడా ప‌రిశ్ర‌మ‌లోకి తెలుగు అమ్మాయిలు రావాల‌ని…ధైర్యంగా ఇక్కడ లైఫ్ ని లీడ్ చేయోచ్చ‌ని వ్యాఖ్యానించింది. ఇదే అదునుగా ప్ర‌ణ‌వి….శ్రీలీల‌ని ఇక్క‌డ ఎలా మెల‌గాలి? అన్న అంశంపై ప్ర‌త్యేకంగా టిప్స్ కూడా అడిగిన‌ట్లు తెలుస్తోంది.

వేడుక‌లో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌నే కుర్చున్న నేప‌థ్యంలో శ్రీలీల‌ని గుచ్చి మ‌రీ టిప్స్ గురించి అడిగిందిట‌. ప‌రిశ్ర‌మ‌లో ఎలా న‌డుచుకోవాలో కాస్త చెప్పామ్మా? అంటే బౌండ‌రీస్ దాట‌కుంటా..వాటిని మెయింటెన్ చేస్తుంటే చాలు ఇక్క‌డ అంతా సేఫ్ గా ఉండొచ్చ‌ని స‌ల‌హా ఇచ్చిందిట‌. మొత్తానికి శ్రీలీల నుంచి ప్ర‌ణ‌వి కొన్ని విలువైన సల‌హాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వీటిని తూచ త‌ప్ప‌కుండా పాటించాలి. మ‌రి ప్ర‌ణ‌వి వాటిని ఎంత‌వ‌ర‌కూ ఆచ‌ర‌ణ‌లో పెడుతుందో చూడాలి. ప్ర‌ణ‌వి ఇప్ప‌టికే ‘రోటీన్ ల‌వ్ స్టోరీ’..’ఉయ్యాల జంపాల’ చిత్రాల్లో న‌టించింది.

కొన్ని సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేసింది. కళ్యాణ్ రామ్ గారి ‘అమిగోస్‌’లోనూ నటించింది. అయితే అమ్మ‌డికి హీరోయిన్ గాఛాన్స్ రావ‌డం అన్న‌ది రీల్స్ ద్వారానే సాధ్య‌మైంది. ఇక ‘స్ల‌మ్ డాగ్ హ‌స్బెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ – భగవంత్ కేసరిలో బ్రహ్మాజీ గారు, మేము సీన్స్ చేస్తున్నప్పుడే ఈ సినిమా గురించి తెలిసింది. వాళ్ల అబ్బాయి సంజయ్ హీరోగా నటిస్తున్నారు. బ్రహ్మాజీ గారిలాగే మంచి పర్మార్మెన్స్ చేసి ఉంటారు.

ప్రణవి (Pranavi) తెలుగు అమ్మాయి. ఇదొక గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అడ్డేదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే. భీమ్స్ ధమాకా తర్వాత మళ్లీ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా సూపర్ హిట్ కావాలి. అన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus