Pranitha Subhash: వాళ్లు నోటికొచ్చినట్లు వాగుతారంటున్న ప్రణీత సుభాష్!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ప్రణీతకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రణీతకు ఆ తర్వాత విడుదలైన సినిమాల ఫలితాలు భారీ షాకిచ్చాయి. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ప్రస్తుతం కుటుంబానికే పూర్తి సమయాన్ని కేటాయిస్తుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం ప్రణీత భర్త నితిన్ రాజుకు పాద పూజ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

భర్తకు పాదపూజ విషయంలో కొంతమంది ప్రణీతను ప్రశంసిస్తే మరి కొందరు మాత్రం ప్రణీతను ట్రోల్ చేశారు. ప్రణీత చేసిన పూజ భీమన అమవాస్య పూజ కాగా ఈ పూజ చేయడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొంతమంది ప్రణీత పాదపూజ చేయడంతో ఆమె ఏ కాలంలో ఉందో అంటూ ఆమెను ట్రోల్ చేశారు. వైరల్ అవుతున్న ట్రోల్స్ గురించి తాజాగా స్పందించిన ప్రణీత సుభాష్ ఘాటుగా బదులిచ్చారు.

లైఫ్ లో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయని ఆమె అన్నారు. ఏం చేసినా 90 శాతం జనాలు పాజిటివ్ గా స్పందిస్తారని 10 శాతం జనాలు మాత్రం నోటికొచ్చిన విధంగా వాగుతారని ప్రణీత అన్నారు. అదంతా నేను పట్టించుకోనని ప్రణీత కామెంట్లు చేశారు. నటిగా నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన ఆచారాలను పాటించనని ఎందుకు అనుకుంటున్నారని ప్రణీత అన్నారు. చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు.

గతేడాది కూడా నేను పూజ చేశానని కాకపోతే ఫోటో షేర్ చేయలేదని ఆమె కామెంట్లు చేశారు. నేను పూజలు, పునస్కారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. మోడ్రన్ గా ఆలోచించడం అంటే మనం నడిచొచ్చిన దారిని మరిచిపోవడం కాదని ప్రణీత చెప్పుకొచ్చారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus