Pranitha Subhash: ఆడపిల్లకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత..!

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్‌ పండంటి ఆడ పిల్లకి జన్మనిచ్చింది. కూతురితో తీసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అల ఈమె అభిమానులతో పంచుకున్నట్టు అయ్యింది.ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ‘పాప పుట్టినప్పటి నుండి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్‌( గర్భిణీ స్త్రీలకు వైద్యం చేసే డాక్టర్) అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి.

కానీ మానసికంగా అయితే ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, మరియు అతని టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా ఎంతోఎంతో కృషి చేశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను’ అంటూ వైద్యులతో దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది ప్రణీత. అయితే ప్రణీత పాప ముఖం కనిపించలేదు. ప్రణీత కూడా అప్పుడే పాప ముఖం చూపించకుండా జాగ్రత్త పడింది.

చాలా మంది పిల్లలు పుట్టినవెంటనే మొబైల్ లైట్ లు పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా ప్రణీత కూడా పాప ముఖం చూపించకూడదని భావించినట్టు తెలుస్తుంది. తెలుగులో అత్తారింటికి దారేది వంటి చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత… ఎక్కువ కాలం ఆ క్రేజ్ ను నిలుపుకోలేకపోయింది. ఇక ప్రణీత కి ఆడపిల్ల కి జన్మనిచ్చిన సందర్భంగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

1

2

3

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus