Prasanth Varma: అయోధ్యలో ఆ సీన్ షూట్ చేయాలనుకున్న ప్రశాంత్.. కానీ?

హనుమాన్ సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ స్కిల్స్, ప్రమోషన్స్ వల్లే ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ సాధించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హిందీలో సైతం ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సంబంధించి మరిన్ని సీక్రెట్స్ ను రివీల్ చేశారు.

హనుమన్ మూవీలో హనుమంతుడు వచ్చే సన్నివేశాన్ని అయోధ్యలో షూట్ చేయాల్సిందని కానీ కుదరలేదని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. అయోధ్య రామ మందిరంలో ఉన్న దీపాలను వెలిగించడానికి ఒక పాప ప్రయత్నిస్తూ ఉంటుందని అయితే గాలి వల్ల ఆ దీపాలు ఆరిపోతూ ఉంటాయని ఆ సమయంలో హనుమాన్ పైన వెళ్లడంతో దీపాలు వెలిగేలా సీన్ రాసుకున్నానని ఆయన తెలిపారు.

ఆ సీన్ ను తెరకెక్కించడం కుదరలేదని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కామెంట్లు చేశారు. ఒకవేళ ఈ సీన్ సినిమాలో ఉండి ఉంటే మాత్రం సినిమాకు ఈ సీన్ హైలెట్ గా నిలిచేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జై హనుమాన్ లో ఇలాంటి సీన్ ను ప్లాన్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జై హనుమాన్ సినిమాలో మరిన్ని గూస్ బంప్స్ సీన్స్ ను ప్లాన్ చేయాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

జై హనుమాన్ బడ్జెట్ గురించి, ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. జై హనుమాన్ లో కూడా తేజ సజ్జా రోల్ ఉంటుందని హనుమంతు పాత్ర కొన్ని నిమిషాలకే పరిమితం అవుతుందని తెలుస్తోంది. జై హనుమాన్ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని సమాచారం అందుతోంది. జై హనుమాన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం. జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus