Prashanth Neel, Rajamouli: సలార్ సినిమాలో ఆ డైలాగ్స్ ఎక్కడ ప్రశాంత్?

ఎక్కడ చూసిన ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా మేనియా కనపడుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా చాలా రోజుల తర్వాత ప్రభాస్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా విషయంలో ప్రశాంత్ (Prashanth Neel) ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిని మోసం చేశారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు రాజమౌళిని ప్రశాంత్ ను మోసం చేయడం ఏంటి అనే విషయానికి వస్తే గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా అందులో ఎలిఫెంట్ చీత డైనోసార్ పెద్ద ఎత్తున డైలాగ్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ ఆ సన్నివేశం తనకు చాలా బాగా నచ్చిందని ఈ సన్నివేశాన్ని చూడటం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకువచ్చారు.

అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా మొత్తంలో కూడా ఎక్కడ ఈ డైలాగ్స్ కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ సీన్ చూడాలని ఆతృత కనబరుస్తున్నటువంటి రాజమౌళిని ప్రశాంత్ మోసం చేశారని అసలు సినిమాలో ఈ సీన్సే లేవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ డైలాగ్స్ అన్ని కూడా కేవలం టీజర్ కోసమే పెట్టారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కానీ మరి కొందరు మాత్రమే డైలాగ్స్ అన్ని కూడా పార్ట్ 2 లో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రశాంత్ ఈ సన్నివేశాలను పార్ట్ 2 లో చూపించబోతున్నారా లేదంటే కేవలం టీజర్ కోసము, సినిమాపై హైప్ పెంచడం కోసం ఇలాంటివి క్రియేట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus