ఆ సినిమాపై అంత నమ్మకం పెట్టుకోకండిస్టార్ దర్శకుడు.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం టీజర్ మరియు కొన్ని పోస్టర్స్ మినహా, ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు. ఇంత పెద్ద యాక్షన్ మూవీ లో సాంగ్స్ ఉన్నాయా లేవా అనే విషయం అనేది తెలియలేదు. రీసెంట్ గానే ఒక ఐటెం సాంగ్ ని రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేసారు కానీ, ఆన్లైన్ లోకి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియని పరిస్థితి.

ఇదంతా పక్కన పెడితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగ, నీల్ సినిమాటిక్ యూనివర్స్ లోనే సలార్ చిత్రం ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అంటే కేజీఎఫ్ తో సలార్ కి లింక్స్ ఉన్నాయని, ట్రైలర్ లో కేజీఎఫ్ క్లైమాక్స్ లో ఉన్న షెడ్డు ఉంది కాబట్టి కచ్చితంగా రాకీ భాయ్ కి సలార్ తో లింక్స్ ఉంటాయని అనుకున్నారు.

అయితే ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దీనిపై క్లారిటీ ఇస్తూ ‘అలాంటి అంచనాలు ఈ చిత్రం పై అసలు పెట్టుకోకండి, కేజీఎఫ్ కి సలార్ కి అసలు లింక్ అనేదే లేదు. సలార్ ఒక ప్రత్యేకమైన చిత్రం, లేని పోనీ అంచనాలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు’ అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని ఆశపడిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus