ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన వరదరాజు మన్నార్ పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ ఈ పాత్ర గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వరదరాజు మన్నార్ పాత్రలో నటించడం కోసం ముందుగా బాలీవుడ్ హీరోలను అనుకున్నాము కానీ ఎవరు కూడా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయలేరని తెలిసి పృథ్వీ గారిని కలిశామని తెలిపారు. ఈ సినిమాలో ఈయనని సెకండ్ హీరోగా ఒప్పించడానికి చాలా కష్టమవుతుందేమోనని భావించాము. ఈ సినిమా కథ చెప్పగానే పృధ్విరాజ్ ఎంతో ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాకు కమిట్ అయ్యారని ప్రశాంత్ నీల్ తెలిపారు.
ఈ సినిమాలో ఈయన పాత్ర ఒకేసారి ప్రేమ ద్వేషం చూపించే పాత్రను పోషించారని, ఈ పాత్రకు ఈయనే న్యాయం చేయగలరని భావించాను. ఇక పృథ్వీ ఒక సన్నివేశానికి కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక దర్శకుడు కోణంలో కూడా ఆలోచించి కొన్ని సలహాలు కూడా ఇస్తారని తెలిపారు.
పృథ్వీ సలార్ సినిమా కోసం ఎన్నో ఆలోచనలను మాతో పంచుకున్నారని ఒక మాట చెప్పాలి అంటే ఈ సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనే బిరుదు కూడా ఇవ్వచ్చు అని తెలిపారు. పృథ్వీ లేకపోతే సలార్ సినిమానే లేదని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పృథ్వీ రాజ్ సుకుమారన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.