Prashanth Neel: సలార్ క్లైమాక్స్ పై నిర్మాతలు ఇచ్చిన అప్ డేట్ ఇదే!

2023 సంవత్సరంలో విడుదల కానున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో సలార్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సంచలన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని కొన్ని నెలల క్రితం వార్తలు వైరల్ కాగా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన కాంతార సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కాంతార సినిమాలోని చివరి 20 నిమిషాల సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాను తీసిన హోమబుల్ ఫిల్మ్స్ నిర్మాతలు సలార్ క్లైమాక్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సలార్ మూవీ క్లైమాక్స్ ను కూడా ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసే రేంజ్ లో ఉండేలా చూసుకుంటామని నిర్మాతలు అన్నారు. నిర్మాతలు చేసిన ఈ కామెంట్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ప్రశాంత్ నీల్ సలార్ క్లైమాక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారని నిర్మాతల కామెంట్ల ద్వారా అర్థమవుతుంది. 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాతో సలార్ ను మించిన సక్సెస్ ను అందుకుంటానని భావిస్తున్నారు.

సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండటం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus