Jr NTR: తారక్ మూవీపై ప్రశాంత్ నీల్ షాకింగ్ అప్ డేట్.. ఏం చెప్పారంటే?

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా కామెంట్లు చేసిన ప్రశాంత్ నీల్ అదే సమయంలో అభిమానులకు ఒకింత షాకిచ్చారు. తన గత సినిమాలతో పోల్చి చూస్తే ఎన్టీఆర్ సినిమా భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రేక్షకులు ఈ మూవీ యాక్షన్ మూవీ అని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మూవీ జానర్ ఏదైనా అది అభిమానులకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుందని ప్రశాంత్ నీల్ తెలిపారు.

2024 సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నామని ప్రశాంత్ నీల్ అన్నారు. దేవర సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధమైందని ప్రశాంత్ నీల్ అన్నారు. కేజీఎఫ్3 మూవీ తప్పక ఉంటుందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. కేజీఎఫ్3 సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో కేజీఎఫ్2 మూవీ ఎండింగ్ లో హింట్ ఇచ్చామని ప్రశాంత్ నీల్ అన్నారు.

అమితాబ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని అమితాబ్ తో ఒక సినిమా చేయాలని ఉందని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. సలార్1 సినిమాలో సైతం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. సలార్ సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతుండగా సలార్2 సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ఇతర భాషల్లో సైతం మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి. ప్రశాంత్ నీల్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus