రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. హనుమాన్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ విషయంలో మేకర్స్ సంతోషంగా ఉన్నారు. నార్త్ లో సైతం హనుమాన్ సినిమా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని మేకర్స్ ఫీలవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూపర్ హీరో ఫార్ములా కథ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నారు. అందరూ ఇష్టపడే నటుడు ఈ సినిమాలో హీరోగా చేయాలని తేజ సజ్జాను ఎంపిక చేశానని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమా కోసం తేజ సజ్జా నాకంటే ఎక్కువ ఆశలు పెట్టుకుని పని చేశాడని అన్నారు. థియేటర్ల వివాదం వల్లే హనుమాన్ ఎక్కువగా వార్తల్లో నిలిచిందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
హనుమాన్ లో నాటకీయతకు పెద్దపీట వేశానని ఈ సినిమాలో 1600 విజువల్ ఎఫెక్స్ట్స్ షాట్స్ ఉన్నాయని ఇకపై మరింత వేగంగా సినిమా తీయగలననే నమ్మకాన్ని ఈ సినిమా కలిగించిందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తన పేరును తప్పుగా పలకడం గురించి ప్రశాంత్ వర్మ (Prashanth Varma) మాట్లాడుతూ “పేరులో ఏముంది.. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు” అని వెల్లడించారు.
హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ టైటిల్ తో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సక్సెస్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కొన్నిరోజుల ముందు హనుమాన్ మూవీ రిలీజ్ కావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!