ఫోన్‌ చేసి చాలా మంది అడిగారు: ప్రశాంత్‌ వర్మ

  • February 4, 2021 / 11:51 AM IST

‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌తో సినిమా అనౌన్స్‌ చేశాక.. చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇదేంటి జాంబీల్లో రెడ్డి అని ఉంటారా? ఇలాంటి పేరేంటి అని చాలామంది ప్రశ్నించారు. మీకూ ఇలాంటి ప్రశ్న… ఎప్పుడో ఓ సమయంలో వచ్చే ఉంటుంది. అయితే సినిమాకు ఈ పేరు పెట్టడానికి వెనుకున్న కారణం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. జాంబీకి.. రెడ్డికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటికైనా టైటిల్‌ గురించి వస్తున్న వార్తలు, ఆలోచనలు ముగుస్తాయేమో చూడాలి.

ప్రశాంత్‌ వర్మ ఎప్పుడూ కొత్త రకం కంటెంట్‌తో సినిమాల చేయాలని చూస్తుంటాడు. ఆయన గత రెండు చిత్రాలు ‘ఆ!’, ‘కల్కి’ సినిమాలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. అలానే ‘జాంబీ రెడ్డి’ సినిమా విషయంలోనూ ఆలోచించాడట. కొత్త జోనర్స్‌లో సినిమాలు చేసి ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతోనే ఈ సినిమా చేశాడట. ఆ క్రమంలోనే సినిమా పేరు విషయంలోనూ ఆలోచించాడట. ‘జాంబీలు మన ప్రాంతంలోకి వస్తే ఎలా ఉంటుంది..?’ అనే ఆలోచన చాలాకాలం ఆలోచించాడట ప్రశాంత్‌ వర్మ.

జాంబీల మీద ఇంతకుముందు హారర్‌ సినిమాలు వచ్చాయి. కానీ కాస్త వినోదాత్మకంగా జాంబీల నేపథ్యంలో సినిమా చేద్దామనే ఈ సినిమా చేశాడట ప్రశాంత్‌ వర్మ. ‘రెడ్డి’ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరకమైన ఎమోషన్‌ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలంటే రెడ్డి అనే పేర్లను అభిమానులు కచ్చితంగా కోరుకుంటారు. ఈ సినిమాలో జాంబీలు రాయలసీమ నుంచి వస్తాయి కాబట్టి.. ‘జాంబీ రెడ్డి’ అని టైటిల్‌ పెట్టాం. అంతే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. మొదట్లో కొంతమంది ఫోన్‌ చేసి టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌ వర్మ.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus