ఫ్యామిలీ సినిమాలో కూడా ట్విస్ట్ ప్లాన్ చేసావా మారుతీ..!

సాధారణంగా ట్విస్ట్ లనేవి ఎక్కువగా యాక్షన్ లేదా థ్రిల్లర్ సినిమాల్లో చూస్తుంటాం..! కానీ ఇక్కడ ఫ్యామిలీ సినిమాలో కూడా ట్విస్ట్ ప్లాన్ చేసాడట దర్శకుడు మారుతీ. ఆయన తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘ప్రతీరోజూ పండగే’. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జి.ఏ.2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

మరణానికి దగ్గర పడుతున్న ఓ తాతయ్య కథ ఇదని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఓ తాత‌య్య తన చివ‌రి రోజుల్లో తన కుటుంబంతో కలిసి గడపాలని ఆశపడుతుంటాడు. దానికి మనవడు (హీరో) సాయం చేస్తుంటాడు. అలా కుటుంబం అంతా మళ్ళీ దగ్గరగా వస్తుంటారు. చివరికి తాతయ్య చనిపోతే ఈ చిత్రం ట్రాజెడీ ఎండింగ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగదట. ఇదంతా ఒంటరిగా జీవితం గడుపుతున్న తాతయ్య కోసం.. అతని విలువలు కుటుంబంలో వాళ్ళు అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనవడు ఆడించే డ్రామా అని తెలుస్తుందట. అసలు మ్యాటర్ తన తాతయ్యకు కూడా తెలీదట. ఈ విషయం డాక్టర్ల ద్వారా తాతయ్యకు చెప్పిస్తాడట ఆ మనవడు. మరి ఈ లీకైన ఈ ట్విస్ట్ లో నిజమెంత అనేది మరో 4 రోజుల్లో తెలుస్తుంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus