2014 ఎన్నికల టైంకి నారా రోహిత్ (Nara Rohit) హీరోగా రూపొందిన ‘ప్రతినిధి’ (Prathinidhi) రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. కానీ ఎన్నికల టైం కాబట్టి.. టీడీపీ పార్టీకి ఈ సినిమా మంచి మైలేజ్ ను అందించింది. ఆ తర్వాత టీవీల్లో కూడా బాగా చూశారు. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) వచ్చింది.ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.టీడీపీ పార్టీకి ఈ సినిమా ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (Murthy Devagupthapu) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిన్న అంటే మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.21 cr |
సీడెడ్ | 0.06 cr |
ఆంధ్ర(టోటల్) | 0.26 cr |
ఏపీ + తెలంగాణ | 0.53 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.05 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.58 cr |
‘ప్రతినిధి 2’ చిత్రం రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.0.58 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.3.42 కోట్ల షేర్ ను రాబట్టాలి.