సాయి తేజ్ టార్గెట్ చాలా ఈజీ..!

‘జిఏ2 పిక్చర్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ప్రతీరోజూ పండగే’. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ మారుతీ డైరెక్ట్ చేసాడు. సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మరియు తమన్ సంగీతంలో వచ్చిన పాటలకు మంచి స్పందన లభించింది. ఇక సాయి తేజ్ కూడా ‘చిత్రలహరి’ చిత్రంతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు కాబట్టి.. ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. దానికి తగినట్టే బిజినెస్ కూడా బాగా జరిగిందనే చెప్పాలి.

ఇక ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 5.5 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 2 cr
ఈస్ట్ 1.3 cr
వెస్ట్ 1.1 cr
కృష్ణా 1.2 cr
గుంటూరు 1.45 cr
నెల్లూరు 0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1 cr
ఓవర్సీస్ 1 cr
వరల్డ్ వైడ్ టోటల్ 18 cr

‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడమే కాకుండా బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ‘చిత్రలహరి’ చిత్రం కూడా 15 వరకూ షేర్ ను రాబట్టింది. కాబట్టి సాయి తేజ్ టార్గెట్ పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus