Karthika Deepam: ‘కార్తీకదీపం’ సీరియల్.. మరో సంచలనానికి నాంది..!

రిలీజ్ కి ముందు ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా అవసరం కూడా..! కానీ మొన్నామధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాలకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ‘ఇదేం విడ్డూరం’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు అంతకు మించిన వింత చోటు చేసుకోబోతుంది. అవును.. వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

పైన హెడ్డింగ్ చూడగానే ఈపాటికే చాలా మందికి అర్ధమైపోయుంటుంది అనుకోండి.! ఓ సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అవును నిజమే..! మీరు వింటున్నది, చదువుతున్నది కరెక్టే..! టెలివిజన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టి.ఆర్.పి రేటింగ్లని నమోదు చేసిన సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఇదొక బుల్లితెర ‘బాహుబలి’గా అందరూ భావిస్తుంటారు. ఈ సీరియల్లోని డాక్టర్ బాబు (Nirupam Paritala) , వంటలక్క (Premi Viswanath) పాత్రలని ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రలను ఉద్దేశిస్తూ ఎన్ని మీమ్స్ వచ్చాయో అందరికీ తెలుసు. ఈ సీరియల్ పూర్తయ్యి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతుంది.’కార్తీకదీపం- ఇది నవ వసంతం’ అనే టైటిల్ తో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సీరియల్ ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు మార్చి 21 న ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ వేడుక జరగనుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus