వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన జెనీలియా!

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అవార్డు ఫంక్షన్ లో నటి జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్.. ప్రీతీ జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్.. ప్రీతీ జింటా చేతులను పట్టుకొని ముద్దుపెట్టుకున్నారు. ఆ తరువాత నవ్వుతూ ఆమెతో మాట్లాడుతూ ఉండడంతో.. పక్కనే ఉన్న జెనీలియా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటుంది. తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడాన్ని జెనీలియా తట్టుకోలేకపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

అయితే ఇందులో జెనీలియా ఎక్స్ ప్రెషన్స్ కి అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. నిమిషాల్లో వీడియో వైరల్ అయిపోయింది. దీనిపై చాలా స్పూఫ్ వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఈ వీడియోకి మిళియన్స్ లో వ్యూస్ రావడంతో జెనీలియా కూడా చాలా ఫన్నీగా స్పందించింది. ”ఈ ఫంక్షన్ తరువాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..?” అంటూ మరో వీడియో రిలీజ్ చేసింది. ఇందులో జెనీలియా తన భర్తను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియో చేసింది.

ఈ వీడియోకి రితేష్, ప్రీతీ జింటాలను ట్యాగ్ చేసింది. వెంటనే స్పదించిన ప్రీతీ.. ఇది చాలా ఫన్నీగా ఉందని.. లవ్ యు బోత్ అంటూ పోస్ట్ పెట్టింది. నిజానికి ఈ వీడియో 2019లో ఐఫా అవార్డ్స్ కి సంబంధించింది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వీడియో బయటకొచ్చి హల్చల్ చేసింది. దీనికి జెనీలియా కూడా స్పదించడంతో హాట్ టాపిక్ గా మారింది.


Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus