‘బలమెవ్వడు’ నుంచి ‘ప్రేమంటే భద్రం కొడుకో’ పాట విడుదల

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘బలమెవ్వడు’. వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు.

Click Here To Watch

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌, మ‌ర‌క‌తమ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పాడిన టైటిల్ సాంగ్‌.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో చిత్రంలోని ‘ప్రేమంటే భద్రం కొడుకో’ అనే పాటను విడుదల చేశారు.

శ్రీమద్ రామా రమణ గోవిందో హార్.. అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి సాహిత్యాన్ని సమకూర్చగా.. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో సినిమా మేకింగ్ విజువల్స్‌ను జోడించారు. టీం అంతా కలిసి సరదాగా షూటింగ్ చేసినట్టు కనిపిపిస్తోంది.

హీరో హీరోయిన్స్, ఫృథ్విరాజ్, సుహాసిని గార్ల నటన, కథ, డైలాగ్స్ ఈ బలమెవ్వడు సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయి., అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్లు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus