Premi Viswanath: అబ్బో.. వంటలక్క అంత రిచ్చా.. షాకింగ్ విషయాలు తెలిపిన ‘కార్తీక దీపం’ ప్రేమి విశ్వనాథ్

‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టెలివిజన్ రంగంలో ఓ ‘బాహుబలి’ లాంటిది ఈ సీరియల్ అని చెప్పొచ్చు. 5 ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘కార్తీకదీపం’ సీరియల్ అందరికీ ఎక్కువగా గుర్తుకొచ్చేది వంటలక్క అలియాస్ దీప పాత్ర. సీరియల్ కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.అందుకే ఈ పాత్ర పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తుంటాయి.

మొన్నామధ్య ఈ పాత్రను తీసేయడం వల్ల సీరియల్ టీఆర్పీ తగ్గిపోయింది అని భావించిన మేకర్స్ మళ్ళీ కొత్త కథనంతో ఈ పాత్రను ప్రవేశ పెట్టారు అంటే ఈమె ఏ రేంజ్లో పాపులర్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ‘వంటలక్క’ పేరుతో కామెడీ ట్రాక్ లు కూడా పండించారు. ఈ పాత్రను పోషించింది మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్. సీరియల్ లో నటిస్తుంది కదా అని.. ప్రేక్షకులకు ఈమె పై కొంత చిన్న చూపు ఉండొచ్చు.

ఈ మధ్య కాలంలో బుల్లితెర ఆర్టిస్ట్ లు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి బిగ్ బాస్ కు అటు తర్వాత వెండితెరకు దగ్గరవ్వాలని భావిస్తున్నారు. కానీ ప్రేమి మాత్రం ఆ దిశగా అస్సలు ఆలోచించడం లేదు. అందుకు గల కారణాలు ఈమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. “నాకు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయి. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ కు కేవలం ‘కార్తీక దీపం’ షూటింగ్ ఉన్నప్పుడే వస్తాను.

షూటింగ్ పూర్తవ్వగానే అక్కడికి వెళ్ళిపోతాను. సో నాకు అంత టైం ఉండదు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి..! నేను మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టాను. నేను సీరియల్ లో అమాయకంగా కనిపించినా బయట మాత్రం చాలా రెబల్ గా ఉంటాను” అంటూ ప్రేమి విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. గతంలో ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus