సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు (Ilaiyaraaja) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్థాయి, ఆయన అనుభవం ముందు ఎవ్వరైనా మోకరిల్లాల్సిందే. అటువంటి సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇళయరాజాకు ఘోరమైన అవమానం జరిగింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుట్టూర్ ఆండాళ్ గుడికి వెళ్లిన ఇళయరాజాను గర్భగుడి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాక అక్కడి నుండి బయటికి పంపేశారు. ఇళయరాజా ఎంతలా అడిగినా సరైన కారణం మాత్రం చెప్పలేదు. ఇళయరాజా పుట్టింది క్రిస్టియన్ కుటుంబంలో అయినప్పటికీ..
Ilaiyaraaja
ఆయన హిందువుగా కన్వర్ట్ అయ్యి, రమణ మహర్షిని పూజిస్తారు. ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఇస్లాం మతం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ ఇళయరాజాను మతపరమైన విషయంలోనే గర్భగుడిలోకి రానివ్వకుండా ఆపారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయమై తమిళ చిత్రసీమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే.. తమిళనాట ఇళయరాజాకి (Ilaiyaraaja) ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే.. ఈ తతంగం మొత్తం జరుగుతున్న తరుణంలో ఇళయరాజా పక్కన చినజీయార్ స్వామి ఉండడం, ఆయన ఇళయరాజాకి సపోర్ట్ చేయకపోగా, గుడిలోని అర్చకులతో కలిసి ఇళయరాజాను బయటికి పంపడం అనేది చాలామంది జీర్ణించుకోలేని విషయం. మరి ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వం ఈ తరహా వ్యవహారాలకు వ్యతిరేకం.
మరి ఇళయరాజాకు జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఆ గుడి నియమాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏమైనా మారుస్తుందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇకపోతే.. ఇళయరాజా సంగీతం సమకూర్చిన “విడుదల 2” ఈ శుక్రవారం (డిసెంబర్ 20) విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాపై తమిళంతోపాటుగా తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి.