‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్న శివ కార్తికేయన్… ఈసారి ‘ప్రిన్స్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి ఈ చిత్రానికి దర్శకుడు.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ అక్టోబర్ 21న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు,
పుస్కూర్ రామ్ మోహన్ రావు లు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘శాంతి టాకీస్’ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తాపడింద. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
1.10 cr
సీడెడ్
0.31 cr
ఉత్తరాంధ్ర
0.47 cr
ఈస్ట్+వెస్ట్
0.29 cr
కృష్ణా + గుంటూరు
0.43 cr
నెల్లూరు
0.22 cr
ఏపి+ తెలంగాణ
2.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)+
ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.02 cr (షేర్
‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు.. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవడానికి రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.3.02 కోట్ల షేర్ ను రాబట్టింది.
దీంతో బయ్యర్స్ కు రూ.2.48 కోట్ల నష్టాలను మిగిల్చింది. ‘కాంతార’ ‘సర్దార్’ ‘ఓరి దేవుడా’ వంటి చిత్రాలు పోటీగా ఉండడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది అని చెప్పాలి. సోలో రిలీజ్ అయ్యుంటే ఇంకాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసుండేదేమో..!