Prithviraj, Prabhas: ప్రభాస్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్య కాలంలో పరభాషా హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరోలు విజయ్, ధనుష్,విజయ్ సేతుపతి వంటి వారు రెడీగా ఉన్నారు. మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రని ఇతను పోషిస్తున్నాడు.

Click Here To Watch NOW

దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఇతను మొదట డేట్స్ ఇచ్చినప్పటికీ అతను వాడుకోలేదట.దాంతో పృథ్వీరాజ్ సుకుమారన్ హర్ట్ అయ్యాడట. తర్వాత నీల్ డేట్స్ గురించి అడిగినప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదట. తాను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన వేరే హీరోని తీసుకోమని నీల్ తో చెప్పారట పృథ్వీరాజ్. ఈ విషయం ప్రభాస్ కు తెలీడంతో వెంటనే పృథ్వీకి ఫోన్ చేసి ఆ పాత్ర నువ్వు చేస్తేనే బాగుంటుంది అని కన్విన్స్ చేశారట. ప్రభాస్ మాట్లాడిన తీరు,పృథ్వికి నచ్చిందట.

ప్రభాస్ మంచితనం కల్మషం లేని మనస్తత్వం నచ్చి మళ్ళీ డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.‘సలార్’ కొత్త షెడ్యూల్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని తెలుస్తుంది. శృతీ హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుందనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ 30 శాతం ఫినిష్ అయ్యిందని తెలుస్తుంది. జగపతి బాబు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఆయన లుక్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus