వచ్చే ఆస్కార్‌ ప్రభాస్‌ విలన్‌ను చూస్తామా? ఈ సినిమాతోనే!

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ ట్రైలర్‌ వచ్చింది చూశారా? అంత ప్రత్యేకంగా చెబుతున్నారు ఏముంది అందులో అనుకుంటున్నారా? ఇంగ్లిష్‌లో ‘ది గోట్‌ లైఫ్‌’ పేరుతో విడుదల చేస్తున్న ఈ సినిమా విషయంలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేకాదు ఏకంగా ఆస్కార్‌ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. ఏంటీ.. అస్కారా? అంత బాగుందా అంటారా? అభిమానుల రియాక్షన్‌, టీమ్‌ కష్టం, సినిమా ఫ్లేవర్‌ చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

మలయాళ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా, నటిస్తూ నటుడిగా అదరగొడుతున్నాడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌. ఇప్పుడు బ్లెస్సీ దర్శకత్వంలో ‘ఆడు జీవితం’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నజీబ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. కేరళకు చెందిన ఈ వలస కార్మికుడు సౌదీ అరేబియాకి సంపాదించడానికి వెళ్లి ఎడారిలో మేకల కాపరిగా పనిచేస్తాడు. ఆ తర్వాత బలవంతంగా బానిసగా మారిపోతాడు. అయితే అక్కడి నుండి నజీబ్‌ ఎలా తప్పించుకున్నాడు అనేదే సినిమా.

సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ భార్యగా అమలాపాల్ నటించింది. బెన్యామిన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కించారు. జోర్డాన్, అల్జీరియాలోని సహారా ఎడారిలో కఠినమైన పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ షూట్ చేశారు. ప్రొడక్షన్ కోసం ఇండియాకు, యూఎస్ కు చెందిన నాలుగు కంపెనీలు పని చేశాయట. ఏఆర్ రెహమాన్ సంగీతం, రసూల్ పకుట్టి సౌండ్ డిజైన్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ సినిమాకు అదనపు ఆకర్షణలు.

ఈ సినిమాను 3Dలోనూ విడుదల చేస్తారట. ఇదంతా వింటుంటే మన దేశం నుండి, అందులోనూ సౌత్‌ నుండి త్వరలో రాబోతున్న బిగ్గెస్ట్ సెన్సేషన్ అని అంటున్నారు. ఆస్కార్‌కు పంపిస్తే అవార్డు కూడా రావడం పక్కా అని చెబుతున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కష్టానికి ఆస్కార్‌ పురస్కారం గౌరవంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక టైటిల్‌లో ప్రభాస్‌ విలన్‌ అని అన్నారేంటి అనుకుంటున్నారా? ‘సలార్‌’ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా ఓ విలన్‌ కదా.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus