మోహన్ లాల్ సేఫ్ గేమ్… పృథ్వీ రాజ్ తల్లి ఆవేదన!

‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) ఇటీవల రిలీజ్ అయిన సినిమా. గతంలో వచ్చిన ‘లూసిఫర్’ కి సీక్వెల్. కేరళ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మత ఘర్షణ ప్రధాన అంశంగా తీశాడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) . చాలా వరకు ఈ సినిమాలో పెట్టిన క్యారెక్టర్ల పేర్లు కూడా నిజం జీవితంలో ఉన్నవారికి రిలేట్ అవుతున్నాయి. అన్నీ ఎలా ఉన్నా.. ఒక సీన్లో అయితే హింస మరీ శృతి మించినట్లు అర్థం చేసుకోవచ్చు.

Prithviraj Sukumaran

ఓ గర్భిణీ స్త్రీ పై అత్యాచారం చేసే సీన్ అయితే అతి దారుణంగా అనిపించింది. గతేడాది చివర్లో మలయాళంలో వచ్చిన ‘మార్కో’ లో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. అసలు ఇలాంటి సన్నివేశాలకి మలయాళ సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంటుందో అర్థం కావట్లేదు. ‘ఎంపురాన్’ లో ఆ సీన్ పై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పృథ్వీరాజ్ సుకుమారన్ ని అందరూ నిందిస్తున్నారు.

ఈ క్రమంలో మోహన్ లాల్ (Mohanlal) క్షమాపణలు చెప్పడం జరిగింది. అది పరోక్షంగా ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పినట్లు అయ్యింది. దీంతో పృథ్వీరాజ్ కార్నర్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకే పృథ్వీరాజ్ సుకుమారన్‌ తల్లి మల్లిక ఆవేదన వ్యక్తం చేశారు. ” నా బిడ్డను అన్యాయంగా కార్నర్ చేశారు.

బలిపశువును చేశారు,మోహన్ లాల్ కి తెలీకుండా ఇందులో ఎటువంటి సన్నివేశాలు జోడించలేదు, సెన్సార్ వారు చూసి సర్టిఫికెట్ ఇచ్చాకే సినిమాను విడుదల చేశారు” అంటూ సోషల్ మీడియాలో మల్లిక పేర్కొన్నారు. ఆమె అభిప్రాయం ఎలా ఉన్నా.. కంటెంట్ విషయంలో డైరెక్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

పారితోషికం కోసమే సినిమాకి ఓకే చెప్పాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus