మలయాళ నటి ప్రియా ప్రకాష్ నటించిన ‘ఒరు అధార్ లవ్’ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒక్క కన్నుకొట్టి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ కి ఏర్పడ్డ క్రేజ్ ని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ చిత్రం ఘోరంగా ప్లాపయ్యింది. ‘ఇక ఈ చిత్రంలో ప్రియా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలనే సినిమా ప్లాప్ అయ్యిందని … నా పాత్రని బాగా తగ్గించేశారని , హీరోయిన్ గా తీసుకొని సైడ్ క్యారెక్టర్ చేసేసారని’ ఇటీవల మరో నటి నూరిన్ నూరిన్ షరీఫ్ ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే… నూరిన్ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజంలేదని ప్రియా ప్రకాష్ అంటుంది. నిజానికి ఈ చిత్రంలో ప్రియా కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమేనని… కానీ తనకి వచ్చిన పాపులారిటీతో నిర్మాతలు కథ మార్చమని ఒత్తిడి చేయడంతో ఆమెని మెయిన్ హీరోయిన్ గా మార్చాల్సి వచ్చిందని… దర్శకుడు ఒమర్ లులు కూడా ప్రియా పై కామెంట్స్ చేసాడు. ఇక తాజాగా ఈ విషయం పై మీడియాతో ముచ్చటించింది ప్రియా ప్రకాష్.. “నా కారణంగా నూరిన్ ని ఏమీ పక్కన పెట్టలేదు.. వాళ్ళు చెప్పేది అస్సలు నిజం కాదు. ‘మాణిక్య మలరయ’ పాట హిట్ అయిన తరువాత సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఇచ్చారనే మాటల్లో నిజం ఎంతమాత్రం లేదు. దర్శకుడికి నా నటన నచ్చడంతో ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు, నా కోసం స్క్రిప్ట్ ప్రత్యేకంగా ఏమీ మార్చేయలేదు.ఇక నూరిన్ ఈ చిత్రంతో చాలా కనెక్ట్ అయిందని, ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాతో స్క్రీన్ షేర్ చేసుకునే విషయంలో ఆమె అప్సెట్ అయి ఉంటుంది. నేను మాత్రం ఎవరి అవకాశాలను లాక్కోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. సినిమా రెలీజయ్యి ఫ్లాప్ కూడా అయిపొయింది. అయినా ఏదో ఒక వివాదంతో ఈ చిత్రం హైలెట్ అవుతుంది. మరి ఈ వివాదాలు ఎప్పటికి తగ్గుతాయి చూడాలి..!