Priya Prakash Varrier: అలా చేయడం కరెక్ట్ కాదంటున్న ప్రియా వారియర్!

తక్కువ సినిమాలే చేసినా తెలుగులో ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో ప్రియా వారియర్ ఒకరనే సంగతి తెలిసిందే. ఒరు అడార్ లవ్ లవ్ మూవీలో కన్ను గీటి ఆ వీడియో ద్వారా ప్రియా వారియర్ పాపులర్ అయ్యారు. తెలుగులో ప్రియా వారియర్ చెక్ సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. లవ్ హ్యాకర్స్ అనే సినిమాతో ప్రియా వారియర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ గా నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒరు అడార్ లవ్ మూవీ రిలీజైన తర్వాత తాను సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా వల్ల తాను సైబర్ వేధింపులకు గురయ్యానని ప్రియా వారియర్ వెల్లడించారు. ఆ సినిమా వల్ల తనపై కేసు నమోదైందని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో తనకు తెలిసేది కాదని ఆమె కామెంట్లు చేశారు.

కెరీర్ తొలినాళ్లలోనే నేను సెన్సేషన్ గా మారిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. నేను కన్ను గీటిన సాంగ్ కు ఊహించని స్థాయిలో పేరొచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో నాపై మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఆమె తెలిపారు. ఆ ట్రోల్స్, మీమ్స్ ను నేను భరించలేకపోయానని ఆమె వెల్లడించారు.

అప్పుడు నా వయస్సు 18 ఏళ్లు అని ఆ సమయంలో నేను ఎలా ఉండాలో మార్గదర్శనం చేసేవాళ్లు లేరని ఆమె తెలిపారు. నటులు కావడం వల్ల మా ప్రపంచాన్ని ఇతరులతో పోలిస్తే కొంచెం ఎక్కువగా చూపిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ప్రియా వారియర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus